, న్యూఢిల్లీ : 2024 కల్లా ఏపీలో మూడు ఆసియా ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్( ఏఐఐబీ) ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ థాగూర్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర మంతి అనురాగ్ సింగ్ సమాధానం చెప్పారు. రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా, పట్టణాలతో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం పేరుతో ఈ మూడు ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి