అక్కడి నుంచి దాన్ని తొలగించాల్సిందిగా యజమానికి వారంతా కోరగా, అలవాటయితే అది కూడా కుక్కలాగానే మనిషులతోని మంచిగానే ఉంటుందని చెబుతూ వచ్చాడట. ఆ సింహం ప్రస్తుతానికి ఏమనకపోయినా ఏదో రోజు పిల్లలనో, తమనో పీక్కు తింటుందని ఆందోళన చెందిన అపార్ట్‌మెంట్ వాసులు నేరుగా పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతో అటవి సిబ్బంది వచ్చి ఆ సింహం పిల్లకు మత్తుమందు ఇచ్చి లెక్కి ప్రాంతంలోని జంతు ప్రదర్శన శాలకు దాన్ని తరలించారు. ఈ విషయం తెల్సినప్పటి నుంచి గత రెండు రోజులగా ఆ యజమాని పత్తా లేకుండా పోయాడట. ఆయన ఆచూకి దొరికితే ఆయన్ని వన్య సంరక్షణ చట్టాల కింద అరెస్ట్ చేస్తామని అటవి శాఖ అధికారులు తెలిపారు. ఆ ఆసామీ పేరు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. రెండు నెలల క్రితమే ఆయన ఈ సింహం పిల్లను కొనుక్కొని వచ్చాడట.